భద్రాచలం వద్ద తగ్గుతోన్న గోదావరి నీటిమట్టం - రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ - Flood Flow To Bhadrachalam Receded - FLOOD FLOW TO BHADRACHALAM RECEDED
Published : Sep 12, 2024, 10:21 AM IST
Bhadrachalam Godavari Flood Flow Receding : భద్రాద్రి వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. బుధవారం ఉదయం 50.6 అడుగులకు పెరిగిన గోదావరి నీటిమట్టం, అనంతరం క్రమంగా తగ్గుతూ వస్తుంది. గురువారం ఉదయం 9 గంటలకు 43.3 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం తగ్గుతుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. గోదావరి నీటిమట్టం మరికొద్దిసేపట్లో 43 అడుగుల కిందకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికనూ ఉపసంహరించుకోనున్నారు.
నీటిమట్టం పెరిగి తగ్గుతుండటంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి చేరిన వరద నీరు తగ్గిపోయింది. భద్రాచలం ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో నీటిమట్టం ఇంకా కొంతమేర నిలిచి ఉంది. చింతూరు, కూనవరం మండలాలలోని చాలా ఇండ్లు వరద నీటిలో మునిగిపోయాయి. కాగా ముంపు మండలాల్లోని చాలా గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఇంకా నీటిమట్టం తగ్గితే ముంపు మండలాల్లోని గ్రామాలు వరద భయం నుంచి బయటపడనున్నాయి.