ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తేనెతుట్టెపై రాళ్లు విసిరిన ఆకతాయిలు - వాకింగ్​ చేస్తున్నవారిపై దాడి - Bee attack in MGM Play Ground

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 1:47 PM IST

bee_attack_in_mgm_play_ground_at_Hindupuram

Bee Attack at MGM Play Ground in Hindupuram : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎంజీఎం​ క్రీడా మైదానం (MGM Play Ground) లో వాకింగ్​ చేస్తున్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి.  మైదానం పక్కన ఉన్న పాఠశాలలోని నీటి ట్యాంకుకు ఉన్న అడవి తేనెపట్టుపై ఆకతాయిలు రాళ్లు విసరడం వల్ల ఒక్కసారిగా అక్కడున్న వారిపై తేనెటీగలు విరుచుకుపడ్డాయి. మైదానంలో ఉన్నవారంతా పరుగులు (Running) తీయడం మొదలు పెట్టారు. అయినా అవి వదలకుండా వెంటాడాయి. మైదానం నుంచి అందరూ పరుగెత్తడం గమనించిన స్థానికులు పొగ వేసి తేనెటీగలను తరిమి కొట్టారు. 

Honey Bee Attack in Sri Satyasai District : తేనెటీగల దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి (Hospital) తరలించి చికిత్స అందించారు. ఆకతాయిల వల్ల వచ్చిన సమస్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో చిన్నపిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details