ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తలుపులు పగులగొట్టి బిస్కెట్లు తిన్న ఎలుగుబంటి- సీసీ కెమెరా ఫుటేజీలో చిక్కిన వీడియో - Bears hulchul in Anantapur - BEARS HULCHUL IN ANANTAPUR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 8:00 PM IST

Bears hulchul in Anantapur District Recorded in CCTV : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని దొడగట్ట రోడ్​ మార్గంలో ఎలుగుబంట్లు హల్​చల్​ చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఎలుగు బంట్లు ఇళ్లలోకి చొరబడుతున్నాయని, జనావాసాల్లో తిరిగి భయాందోళనలకు గురి చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. కళ్యాణ దుర్గంలోని దొడగట్టరోడ్ మార్కెట్ యార్డ్ ఎదురుగా బిస్కెట్స్ ఏజెన్సీ నిర్వాహకులు కరణం రాఘవేంద్ర గోడౌన్​లోకి చొరబడిన ఎలుగు సుమారు 15 నిమిషాల పాటు సంచరించింది. ఏజెన్సీ లోపల బాత్​రూమ్​ తలుపులు పగులగొట్టి, బిస్కెట్ బాక్సులు చించేసి, బిస్కెట్లు తినేసింది. ఇవన్నీ సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. చుట్టూ జనావాసాలు ఉన్నా చీకటి పడితే చాలు ఎలుగుబంట్ల బెడద ఎక్కువైంది అని మంగళ కాలనీ, పూర్ణానంద ఆశ్రమం పరిసరాల్లో ప్రజలు వాబోతున్నారు. అటవీశాఖ అధికారులు చొరవ తీసుకొని వన్యప్రాణుల నుంచి తమను కాపాడాలని వారు కోరుతున్నారు. రోజు రోజుకూ వన్య ప్రాణులు విచ్చలవిడిగా ఇళ్లలో సంచరిస్తున్నాయని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details