చెక్ బౌన్స్ కేసు - బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష - Jail to Bandla Ganesh
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 5:26 PM IST
Bandla Ganesh Check Bounce Case : ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష విధిస్తూ ప్రకాశం జిల్లా రెండవ అదనపు కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రకాశం జిల్లా మద్దిరాలుపాడుకు చెందిన జట్టి జానకీ రామయ్య వద్ద బండ్ల గణేష్ 2019లో అప్పు తీసుకున్నారు. అనంతరం జట్టి జానికీ రామయ్య గుండెపోటుతో మృతి చెందాడు. అప్పు విషయమై జానకీ రామయ్య తండ్రి వెంకటేశ్వర్లు అడగటంతో గణేష్ రూ. 95లక్షల చెక్ ఇచ్చారు. అయితే ఈ చెక్కు చెల్లకపోవడంతో బండ్ల గణేష్‌కు పలుమార్లు ఆయన తెలియజేశారు. ఎన్నిసార్లు తెలిపినా ఆయన నుంచి స్పందన లేకపోవడంతో చివరికి కోర్టును ఆశ్రయించారు.
గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. తాజాగా రెండవ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు బండ్ల గణేష్‌కు ఏడాది జైలు, రూ.95 లక్షల జరిమానా, అదేవిధంగా కోర్టు ఖర్చుల కోసం రూ. 10వేలు పెనాల్టీ విధించింది. ఒంగోలు కోర్టుకు హాజరయిన బండ్ల గణేష్ మీడియాకు చిక్కకుండా తన సహాయకుల సాయంతో బయటకు వెళ్లిపోయారు.