చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదు - రాజీనామా చేసేందుకు ఎంతోసేపు పట్టదు: బాలినేని - Ongole YCP MP Ticket
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 24, 2024, 4:47 PM IST
Balineni Srinivasa Reddy Comments on Ongole MP Ticket: ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇప్పించేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని, ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాలి. మరి ఆ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలని అన్నారు. ఎవరు మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా గెలిపించుకునే బాధ్యత నాది అని అన్నారు. అంతే కాకుండా పేదవారికి ఇళ్లు ఇవ్వని నేపథ్యంలో నేను రాజీనామా చెయ్యడానికి కూడా సిద్ధమయ్యానని వారి కోసం నా రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టానని అన్నారు. సంతనూతలపాడు, కొండపిలో తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వలేదని, కావాల్సిన సీట్ల కోసం రాజీనామా చేయడం నాకు ఎంత సేపు పడుతుందంటూ బాలినేని వ్యాఖ్యానించారు. అయినా అన్నీ సామరస్యంగా జరుగుతాయని, అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని బాలినేని ధీమా వ్యక్తం చేశారు.