ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గంజాయి మత్తు ప్రాణాలు తీస్తోంది-నేరాలు చేయిస్తోంది - Youth Hit Another Person - YOUTH HIT ANOTHER PERSON

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 9:36 PM IST

Assault on Youth Under Influence of Ganja: నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో ఓ యువకుడు గంజాయి మత్తులో మరో యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13న మధ్యాహ్నం అల్లూరులోని సెటిల్మెంట్ కాలనీకి చెందిన జాన్​పాల్, బానిపాల్, రంజిత్ ముగ్గురూ కలిసి రామతీర్థం బీచ్​లో మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. బానిపాల్ మత్తులో బైక్​ను వేగంగా నడుపుతుండటంతో​ వెనుకున్న జాన్​పాల్ తలతిరుగుతుందని వాహనాన్ని ఆపమన్నాడు. 

అతడు​ బైక్​ను ఆపకుండా వేగంగా వెళుతుండటంతో జాన్​పాల్ కోపంతో దూషించాడు. దీంతో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేయడమే కాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం జాన్​పాల్​ను ఇంటి దగ్గర వదిలిపెట్టారు. ఈ విషయం ఆలస్యంగా ఇంట్లో వాళ్లకి తెలియడంతో వెంటనే అల్లూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మత్తులో యువకుడిపై దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.  

ABOUT THE AUTHOR

...view details