తెలంగాణ

telangana

ETV Bharat / videos

తగ్గిన వరద ఉద్ధృతి - భక్తులకు దర్శనమిస్తోన్న ఏడుపాయల వనదుర్గమ్మ - Edupayala Vanadurga Mata Temple

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 11:51 AM IST

Updated : Sep 10, 2024, 12:37 PM IST

Vanadurga Mata Temple in Medak District: మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం వద్ద వరద ఉద్ధృతి తగ్గడంతో తెల్లవారుజామున గర్భగుడిని తెరిచి పూజారులు అమ్మవారికి సంప్రోక్షణ, అభిషేకం, విశేషాలంకరణ మొదలైన ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా సింగూర్ రిజర్వాయర్​ నుంచి నీటిని విడుదల చేయడంతో ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం తొమ్మిది రోజులుగా జల దిగ్బంధంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 

ఈ నేపథ్యంలో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి మాత్రమే అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. నేడు గర్భగుడి ఓపెన్ చేసి యథావిధిగా అమ్మవారి దర్శనం భక్తులకు కల్పిస్తున్నారు. వరద కారణంగా ఆలయ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య కార్మికులు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. భవిష్యత్​లో ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని భక్తులు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Last Updated : Sep 10, 2024, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details