ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: కోవూరు నియోజకవర్గంలో వైఎస్ షర్మిల బహిరంగ సభ- ప్రత్యక్షప్రసారం - ys sharmila election campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 4:56 PM IST

Updated : May 5, 2024, 5:33 PM IST

APCC Chief YS Sharmila Public Meeting Live: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుతో షర్మిల చేతులు కలిపిందంటూ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణలపై, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. జగన్ మానసిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబు కారణమంటున్నారని మండిపడ్డారు. జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని ఎద్దేవా చేశారు. జగన్‌ ఏ స్థాయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని కోరారు. వైఎస్సార్ బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపిందని ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చంద్రబాబుతో చేతులు కలిపినట్లు నిరూపించాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందని జగన్‌ చెప్పారని, దీనిపై సీబీఐ విచారణ చేయాలని గతంలో జగన్‌ కోరారని గుర్తుచేశారు. కానీ జగన్ సీఎం అయ్యాక సీబీఐ విచారణ అక్కర్లేదని చెప్పారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. చంద్రబాబు హస్తం ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడారని షర్మిల ప్రశ్నించారు. సీఎం జగన్ అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను ప్రత్యేక హోదా కోసం ఏపీలో అడుగుపెట్టానని షర్మిల పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ షర్మిల ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : May 5, 2024, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details