తెలంగాణ

telangana

ETV Bharat / videos

సెలవు పెట్టి మరీ గంజాయి సరఫరా - హైదరాబాద్‌లో ఇద్దరు ఏపీ పోలీసుల అరెస్ట్‌ - two ap policemen arrest hyderabad

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 12:40 PM IST

AP Police Constables Arrested in Ganja Case Hyderbad : రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాల సరఫరాపై డేగ కళ్లతో మాటు వేసి, పక్కా సమాచారంతో నిందితులను పట్టుకుంటున్నారు. తాజాగా అక్రమాలను అరికట్టాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కారు. గంజాయి రవాణా చేస్తూ చిక్కారు. హైదరాబాద్‌ బాచుపల్లిలో గురువారం అర్ధరాత్రి పక్కా సమాచారంతో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని బాలానగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. 

Ganja seized In Bachupally Today : నిందితులు ఆంధ్రప్రదేశ్‌ ఏపీఎస్పీకి చెందిన కానిస్టేబుళ్లు సాగర్‌ పట్నాయక్‌, శ్రీనివాస్‌గా గుర్తించారు. కాకినాడ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న వీరు, సెలవు పెట్టి మరీ నర్సీపట్నం నుంచి బాచుపల్లికి గంజాయి తరలించినట్లు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. వారి నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నంలో రూ.12,000 కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసి బాచుపల్లిలో రూ.15,000 చొప్పున అమ్మేందుకు తీసుకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details