'జగన్‌ను ఓడిస్తేనే సర్పంచులకు మనుగడ'- విజయవాడలో ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సమావేశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 20, 2024, 7:14 PM IST
AP Panchayati Raj Chamber Meeting: వైఎస్సార్సీపీ సర్కారు(YSRCP Govt)ను గద్దె దించేందుకు సర్పంచులు సిద్ధమయ్యారు. ఈ మేరకు విజయవాడ పంచాయతీరాజ్ ఛాంబర్(AP Panchayat Raj Chamber), సర్పంచుల సంఘం(Sarpanchula Sangam) నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన జగన్ ప్రభుత్వం ఈనెల 25లోపు సమస్యలపై స్పందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని తీర్మానించాయి. వైఎస్సార్సీపీ సర్పంచులే(YSRCP Sarpanches) ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని(Sarpanches Demands) ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
"రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలపై స్పందించట్లేదు. ఉద్యమం చేసి మేము కూడా విసిగిపోయాం. రాష్ట్ర కమిటీ సమావేశంలో అన్ని విషయాలపై చర్చించాం. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జగన్ ఓడించాలని తీర్మానించాం. ఇప్పటికే వైఎస్సార్సీపీ సర్కారు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. జగన్ పరాజయం చెందితేనే గ్రామ పంచాయతీలకు భవిష్యత్తు, సర్పంచులకు మనుగడ ఉంటుంది." - వైవీబీ రాజేంద్రప్రసాద్, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు