ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖ ఉక్కు భూములు విక్రయించారా? కొనుగోలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా?: హైకోర్టు - Vizag Steel Plant Privatisation

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 10:46 PM IST

AP High Court Questions On Vizag Steel Plant Privatisation : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (KA Paul) దాఖలు చేసిన పిల్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక ప్రశ్నలు సంధించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏ దశలో ఉంది? పిటిషనర్‌ ఆరోపిస్తున్నట్లు ఉక్కు పరిశ్రమకు చెందిన భూములను విక్రయించారా? విక్రయిస్తే ఎన్ని ఎకరాలు విక్రయించారు? తదితర వివరాలను సమర్పించాలని విశాఖ ఉక్కు పరిశ్రమ సీఎండీని న్యాయస్థానం ఆదేశించింది.

Praja Shanti Party President KA Paul on Visakha Steel Plant : విశాఖ ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఉందా? చెప్పాలని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. భూముల విక్రయానికి సంబంధించిన దస్త్రాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్‌కు న్యాయస్థానం సూచించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details