'జగన్ పాలనలో ఆర్థిక అవకతవకలు'- ఎంపీ రఘురామ పిల్‌పై హైకోర్టులో విచారణ వాయిదా - CM YS Jaganmohan Reddy
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 2:05 PM IST
AP High Court on MP Raghu Rama Pill: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవినీతిపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు నేడు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గతంలోనూ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు(AP High Court) 41మంది ప్రతివాదులకు నోటీసులు జారీచేసి, కౌంటర్లు వేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
కేసు వివరాలివీ: వైఎస్సార్సీపీ(YSRCP Govt) హయాంలో.. సీఎం జగన్, ఆయన బంధుగణానికి అనుచిత లబ్ధి చేకూరేలా తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన పాలసీలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామరాజు వేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(Public interest Litigation)లో ప్రతివాదులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM YS Jaganmohan Reddy), ఎంపీ విజయసాయి రెడ్డి(MP Vijayasai Reddy)తో పాటు పలువురు మంత్రులు, అధికారులు ప్రతివాదులుగా ఉన్నారు.