సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పిటిషన్పై హైకోర్టులో విచారణ - తగిన చర్యలపై ఈసీకి ఆదేశాలు - Citizens for Democracy Petition
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 3:03 PM IST
AP High Court on Citizens for Democracy Petition: ఎన్నికల (AP Elections 2024) విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచేలా ఇచ్చిన ఈసీఐ (Election Commission of India) నిబంధన అమలయ్యేలా ఆదేశించాలని కోరుతూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. వాలంటీర్లను ఎన్నికల విధుల (Volunteers in Election Duties)కు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం (ECI) ఇచ్చిన నిబంధనలను అమలు చేయట్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
Citizens for Democracy Petition on Volunteers in Election Duties: వాలంటీర్స్ క్రియాశీలకంగా వ్యవహరించాలని పలువురు నేతలు ప్రసంగాలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నేతల వ్యాఖ్యలపై ఏపీ సీఈవోకు వినతిపత్రం ఇచ్చినా స్పందించలేదని న్యాయవాది తెలిపారు. దీంతో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (Citizens for Democracy) విజ్ఞప్తిపై తగు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఈసీని ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈసీఐ, సీఈవో (CEO) స్పందించి చర్యలు తీసుకోవాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కోరుతోంది.