LIVE: రాజ్‌భవన్ 'ఎట్ హోమ్' కార్యక్రమంలో గవర్నర్ తేనేటి విందు - ప్రత్యక్ష ప్రసారం - Abdul Nazeer AT HOME Program - ABDUL NAZEER AT HOME PROGRAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 15, 2024, 5:01 PM IST
|Updated : Aug 15, 2024, 6:06 PM IST
AP Governor Justice Abdul Nazeer AT HOME Program Live : స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎట్ హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ తేనీటి విందు కార్యక్రమంలో సతీసమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు హాజరయ్యారు. తేనీటి విందు కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు తీసుకున్న తరువాత మూడవసారి ఈ కార్యక్రమం జరుగుతోంది. గత సంవత్సరం ఫిబ్రవరిలో జస్టిస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.రాజ్‌భవన్ 'ఎట్ హోమ్' : ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నాతాధికారులకు రాష్ట్ర గవర్నర్ ఇచ్చే తేనేటి విందు కార్యక్రమాన్ని రాజ్‌భవన్ 'ఎట్ హోమ్' అని పిలుస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ ఒకేసారి హాజరవుతారు.
Last Updated : Aug 15, 2024, 6:06 PM IST