శనివారం తిరుమలకు జగన్ - రాష్ట్రవ్యాప్తంగా పూజలకు వైఎస్సార్సీపీ పిలుపు - Jagan Tweet On Tirumala Laddu Issue
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2024, 7:44 PM IST
EX CM YS Jagan Tweet On Tirumala Tirupati Laddu Controversy : తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని జగన్ అన్నారు. ఇందుకు నిరసనగా వైఎస్సార్సీపీ పూజా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ఈ నెల 28న పూజల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారని ఆరోపించారు. కావాలని అబద్ధాలాడి, కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనికి నిరసనగా పూజా కార్యక్రమాలు చేయాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. తిరుమల పవిత్రతను, స్వామి వారి ప్రసాదం విశిష్టతను, వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగిందని చెప్పడం తగదని ధ్వజమెత్తారు. అందులో భాగంగా ఈ నెల జగన్ 27న తిరుమలకు వెళ్లనున్నారు. శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుని శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు.