LIVE : ఎన్టీఆర్ భవన్లో మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు - AP CM CHANDRABABU AT NTR BHAVAN - AP CM CHANDRABABU AT NTR BHAVAN
Published : Jul 7, 2024, 11:53 AM IST
|Updated : Jul 7, 2024, 1:11 PM IST
AP CM Chandrababu To Visit NTR Bhavan in Hyderabad : ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు. అక్కడ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో చంద్రబాబు పాల్గొని శ్రేణులకు అభివాదం చేశారు. అనంతరం ఎన్టీఆర్ భవన్‌కు చేరుకుని ఆయన మాట్లాడారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావడానికి ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడో చెప్పారు. కానీ గత శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఏ పార్టీకి సపోర్టు చేయకుండా ఉన్నారు. శనివారం జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ చాలా ప్రశాంత వాతావరణంలో సాగింది. ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అటు ఏపీ సీఎం చంద్రబాబు కలిసి మీటింగ్‌లో పాల్గొనడం ఇరు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Last Updated : Jul 7, 2024, 1:11 PM IST