తెలంగాణ

telangana

ETV Bharat / videos

నేడు హైదరాబాద్​కు ఏపీ సీఎం చంద్రబాబు - వెల్​కమ్ CBN అంటూ ఫ్లెక్సీలు - AP CM CHANDRABABU VISITS HYDERABAD - AP CM CHANDRABABU VISITS HYDERABAD

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 9:15 AM IST

AP CM Chandrababu Naidu Coming To Hyderabad : విభజన సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్‌ రానున్న ఏపీ సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేశారు.  "నిజం గెలిచింది", జై తెలుగుదేశం, వెల్‌కమ్‌ టు సీబీఎన్ పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశాలపై శనివారం ప్రజాభవన్‌లో ఇద్దరూ సీఎంలు చర్చించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6గంటలకు బేగంపేట చేరుకోనుండగా అక్కడి నుంచి చంద్రబాబు నివాసం వరకు 50కార్లు, 150 బైక్‌లతో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించనున్నారు. 300 మందికి మించి ర్యాలీలో పాల్గొనవద్దని సూచించిన పోలీసులు డీజేలు, పేపర్‌ స్ప్రే గన్స్‌ వాడొద్దని సూచించారు.

కాగా చంద్రబాబు హైదరాబాద్ రానున్న సందర్భంగా ఏర్పాట్ల గురించి వివరిస్తూ టీడీపీ శ్రేణులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. కనివినీ ఎరుగని రీతిలో స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయంకి చంద్రబాబు వస్తారని చెప్పారు. 7వ తేదీన 11 గంటలకు బంజారాహిల్స్‌లోని ఎన్‌టీఆర్‌ భవన్‌కు రానున్న చంద్రబాబుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సన్మానం చేయనున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details