LIVE: మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడిస్తున్న మంత్రి పార్ధసారధి - CABINET DECISIONS - CABINET DECISIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2024, 4:36 PM IST
|Updated : Aug 28, 2024, 4:51 PM IST
మంత్రివర్గ భేటీ ముగిశాక రాజకీయ అంశాలు చర్చించిన చంద్రబాబు మంత్రుల పనితీరుపై కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు ప్రస్తావన వందరోజుల తర్వాత మంత్రులకు ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్న సీఎం చంద్రబాబు. జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్ కు అందచేస్తామన్న సీఎం.కొందరు మంత్రులు.. ఎమ్మెల్యేలు వివాదస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు సీరియస్. కొందరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మండిపాటు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీతిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు.. ఎమ్మెల్యేలేదన్న చంద్రబాబు.ఒకరిద్దరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వం చేసే మంచంతా పోయి, నేతల తీరే హైలెట్ అవుతోందన్న సీఎం రివర్స్ టెండరింగ్ విధానంపై కీలక చర్చ.గత ప్రభుత్వం మాయ చేయడానికే రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టిందని అభిప్రాయపడ్డ మంత్రులు. గత ప్రభుత్వంలో సుమారు 40 ప్రాజెక్టులకు సింగిల్ టెండర్ పడిందని.. ఇంకేం రివర్స్ టెండరింగ్ విధానం అంటూ అమాత్యుల చర్చ. సీవీసీ గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ల ప్రక్రియ జరిపించాలని సూచన. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జుడిషియరీ ప్రివ్యూను కూడా రద్దు చేయాలని భావించిన కెబినెట్. తాను చేసిన తప్పులకు ఓ జడ్జీతో ఆమోద ముద్ర వేసేలా జుడిషియరీ ప్రివ్యూ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారన్న పలువురు మంత్రులు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జుడిషియరీ ప్రివ్యూను రద్దు చేసేలా చూడాలన్న పలువురు మంత్రులు.ఉచిత ఇసుక పాలసీ అమలుపైనా సమావేశంలో చర్చ.ఇప్పుడిప్పుడే ఇసుక పాలసీ స్ట్రీమ్ లైన్లో పడుతోందన్న చంద్రబాబు.టైమింగ్స్ లేకుండా డే అండ్ నైట్ ఇసుక సరఫరాకి అవకాశం కల్పిస్తే స్టాక్ పాయింట్ల వద్ద లారీల రద్దీ తగ్గుందన్న రామనాయుడు.పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతివ్వాలని సూత్రప్రాయంగా కెబినెట్ అంగీకారం.సార్టెక్స్ బియ్యం సరఫరాను నిలిపిస్తే.. విమర్శలు వస్తాయేమోనన్న పలువురు మంత్రులు.మరింత అధ్యయనం చేసి సార్టెక్స్ బియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని భావించిన మంత్రులు.రేషన్ బియ్యం డెలివరీ వాహానాలని రద్దు చేయాలనే నిర్ణయంపై కెబినెట్లో చర్చ.వాహానాలకు బ్యాంక్ లింకేజీ ఉన్నట్టు చెప్పిన అధికారులు.రేషన్ బియ్యం డెలివరీ వాహానాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్న పయ్యావుల.బ్యాంక్ లింకేజీ ఉన్నందున్న ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు.. వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుందామన్న సీఎం చంద్రబాబు.ఫ్రీ హోల్డులోకి వెళ్లిన భూముల్లో ఎక్కువగా 5 వేల ఎకరాల మేర రిజిస్ట్రేషన్లు సత్యసాయి జిల్లాలోనే జరిగాయని చర్చ ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన ప్రతి రిజిస్ట్రేషన్ను డీటైల్డుగా విచారణ చేపట్టాలన్న సీఎం చంద్రబాబు.
Last Updated : Aug 28, 2024, 4:51 PM IST