LIVE: ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - AP Assembly Sessions 2024 - AP ASSEMBLY SESSIONS 2024
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 26, 2024, 9:06 AM IST
|Updated : Jul 26, 2024, 3:20 PM IST
AP Assembly Sessions 2024 Live: నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై నేడు ముఖ్యంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్థికశాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు, అప్పులను లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతుగా పరిశీలన చేసిన కూటమి ప్రభుత్వం మొత్తంగా రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం, అప్పులు వంటి వివరాలను ప్రజల ముందుంచేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఇప్పటికే పలు అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేసిన ఆయన వాటి వివరాలను ప్రజల ముందుంచారు. దీంతోపాటు టిడ్కో గృహాల స్థితిగతులపై నేడు అసెంబ్లీలో చర్చించనున్నారు. ఈ నెలాఖరుతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ముగియనున్నందున కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా ప్రస్తుత సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం లేదు. ఈ నేపథ్యంలో ఐదోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Jul 26, 2024, 3:20 PM IST