తెలంగాణ

telangana

ETV Bharat / videos

YUVA : ఈనాడు సాయం - మహిళ సివిల్స్​​ కల సాకారం - IFS RANKER ANUSHA INTERVIEW - IFS RANKER ANUSHA INTERVIEW

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 12:25 PM IST

IFS All India Ranker Anusha Interview : చిన్నప్పటి నుంచి చదువంటే ఆ యువతికి మహా ఇష్టం. కానీ నాన్న ఆటో డ్రైవర్​ కావడంతో పెద్ద చదువులు చదివించే స్తోమత లేదు. అయినా పట్టు విడువలేదు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కింది. పదో తరగతిలో 563 మార్కులతో ప్రతిభను చాటుకుంది. జేఈఈ ర్యాంకుతో ఐఐటీ బాంజేలో సీటు సంపాదించింది. 

ఆర్థిక స్తోమత లేక వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడిన, ఆమె ఆర్థిక పరిస్థితులపై ఈనాడులో కథనం వెలువడింది. అనంతరం దాతల సహాయంతో ఇంజినీరింగ్​లో చేరింది. జర్మనీలో ఇంటర్న్​షిప్​ చేసేందుకు అవకాశం దొరికింది. దీంతో ఈసారి మరోసారి ఈనాడులో కథనం ప్రచురితమవడంతో ఆర్థిక తోడ్పాటుతో మూడు నెలల ఇంటర్న్​షిప్​ను పూర్తి చేసింది. పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ పోటీ పరీక్షలకు సన్నద్ధమయింది. 2018 నుంచి సివిల్స్​పై దృష్టి పెట్టిన అనూష చివరకు ఐఎఫ్​ఎస్​లో 106వ ర్యాంకు సాధించింది. మరి, తన భవిష్యత్​ లక్ష్యమేంటి? ఈ స్థాయికి రావడానికి చేసిన సాధనేంటి? అనేక విషయాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందామా?

ABOUT THE AUTHOR

...view details