రాకెట్రీ పోటీల్లో తెలుగు విద్యార్థుల జయకేతనం - అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్ కైవసం - World Cansat Rocketry Championship - WORLD CANSAT ROCKETRY CHAMPIONSHIP
Published : Sep 27, 2024, 4:09 PM IST
World Cansat Rocketry Championship : ప్రస్తుత కాలంలో అంతరిక్షంలోకి రయ్యిమని దూసుకువెళ్లే రాకెట్లు, బంగారు భవిష్యత్తుకు సరికొత్త మార్గాలను చూపే వారధులుగా మారాయి. శాస్త్రవేత్తలు ఇతర గ్రహాల అన్వేషణలో భాగంగా వాటి వాతావరణ పరిస్థితులు మొదలు, అంతరిక్షంలోని గుట్టును విప్పేందుకు శాటిలైట్లను ప్రయోగిస్తూ కొత్తకొత్త సమాచారం సేకరించేందుకు ప్రయోగాలు చేపడుతున్నారు. అంతటి అద్భుతమైన ఈ సైన్స్ పట్ల ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అవగాహన, ఆసక్తి పెరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని అనురాగ్ యూనివర్శిటీ విద్యార్థులు రాకెట్రీలో సత్తా చాటారు. పోర్చుగల్ వేదికగా జరిగిన అంతర్జాతీయ కాన్ సాట్ అండ్ రాకెట్రీ పోటీల్లో పాల్గొని ప్రపంచ ఛాంపియన్‌లుగా నిలిచారు. స్పేస్ రిసెర్చ్ విద్యార్థులు మణిరామ్, రుజుల్ , బాల ప్రణీత్ సాగర్, దివ్యకాంత్‌లు అదరగొట్టారు. ఈ నేపథ్యంలో అసలు వారు తయారు చేసిన ప్రాజెక్టు ఏమిటి? కాన్ సాట్‌లో పాల్గొనటం ఎలాంటి అనుభవాలు నేర్పింది. భవిష్యత్తులో ఎలాంటి సరికొత్త ఆవిష్కరణలు చేయాలనుకుంటున్నారో తెలుసుకుందాం.