పాఠశాల వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన జంతు కళేబరం - తల్లిదండ్రుల ఆగ్రహం - Animal Carcass Eluru District
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 5:50 PM IST
Animal Carcass in Water Tank Eluru District : అదొక ప్రభుత్వ పాఠశాల. అందులో 550 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ పాఠశాలలో ఒక వాటర్ ట్యాంక్. భోజనం చేసే సమయంలో విద్యార్థులు అక్కడే ముఖం, చేతులు, కాళ్లు శుభ్రం చేసుకుంటారు. ఆ వాటర్ ట్యాంక్‌ను ఆదివారం శుభ్రం చేస్తుడంగా కుళ్లిన జంతు కళేబరం కనిపించింది. ఈ సంఘటన ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రభుత్వ హైస్కూల్లో వెలుగు చూసింది. వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
Negligence of Authorities : పోలవరం ప్రభుత్వ పాఠశాలోని వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన జంతు కళేబరం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పాఠశాలోని వాటర్ ట్యాంక్‌ను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు సూచించారు. ఈ విషయాన్ని ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఈ సంఘటన విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.