ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: ఏపీ శాసన మండలి సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - AP Legislative Council Sessions - AP LEGISLATIVE COUNCIL SESSIONS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 10:06 AM IST

Updated : Jul 24, 2024, 3:46 PM IST

AP Legislative Council Sessions Live : ఆంధ్రప్రదేశ్​లో శాసనమండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం, నేడు ఎక్సైజ్‌ శాఖలో జరిగిన అక్రమాల చిట్టాను విప్పనుంది. గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర శ్వేత పత్రం విడుదల చేస్తారు. అదేవిధంగా మండలిలో ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాల్లో గత ప్రభుత్వంలో కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాలు, ఫీజ్ రీఎంబర్స్‌మెంట్‌ పథకం, పోలవరం ప్రాజెక్టు హెడ్​వర్క్స్, విద్యార్థులకు ఆర్థిక సాయం, నీటిపారుదల రంగ అభివృద్ధి, అపరిష్కృత విభజన హామీలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్రంలో బాలికల అదృశ్యం కేసులు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు నియామకం, 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు టోఫెల్ పరీక్ష, పీఎం విశ్వకర్మ పథకంపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు.
Last Updated : Jul 24, 2024, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details