ETV Bharat / state

ఫ్రీ బస్ పథకంపై మంత్రుల ఆరా - మహిళా ప్రయాణికులు ఏమన్నారంటే! - FREE BUS SCHEME STUDY

కర్ణాటకలో ఏపీ మంత్రుల బృందం పర్యటన - శక్తి పథకంపై వివరాల సేకరణ

free_bus_scheme_study
free_bus_scheme_study (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2025, 7:18 PM IST

Updated : Jan 3, 2025, 10:45 PM IST

Free Bus Scheme Study : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మహిళలకు దీపం పథకం అమలుతో పాటు సామాజిక పింఛన్లు పెంచి ఫస్ట్ తారీఖున నేరుగా అందిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలా? మిగతా పథకాలా? అన్న అంశంపై ముఖ్యమంత్రి మంత్రుల అభిప్రాయం కోరారు. ఇదిలా ఉండగా ఫ్రీ బస్ పథకంపై క్యాబినెట్ సబ్ కమిటీ కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం పర్యటించింది. అక్కడి మంత్రులు, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది.

మహిళలకు ఉచిత బస్సు పథకం (Free bus scheme for women)పై అధ్యయనం కోసం మంత్రి వర్గ ఉప సంఘం కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి సహా ఆర్టీసీ అధికారులతో ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, అనిత, గుమ్మడి సంధ్యారాణి ఇతర అధికారులు బెంగళూరులో సమావేశమయ్యారు. కర్ణాటకలో అమలవుతున్న 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం'పై మంత్రుల కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ పథకం అమలుతో అక్కడి మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం, లబ్ధిపై కర్ణాటక బస్సుల్లో ప్రయాణం చేస్తూ వివరాలు అడిగి తెలుసుకుంది.

కర్ణాటకలో ఏపీ మంత్రుల బృందం పర్యటన (ETV Bharat)

గుడ్​న్యూస్ - ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం!

ఉచిత బస్సు పథకం ముందుగా కర్ణాటకలో ప్రారంభించడం తెలిసిందే. ఏపీలోనూ అమలు చేయనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడంపై హోం మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలోని ప్రతినిధి బృందం కర్ణాటకను సందర్శించింది. కర్ణాటక ప్రభుత్వ రవాణా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. '‘శక్తి పథకం' పేరిట అమలవుతున్న ఈ పథకం అమలు తీరుతెన్నులను తెలుసుకునేందుకు హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం అక్కడ పర్యటించింది. బస్సుల్లో ప్రయాణించిన మంత్రులు ప్రయాణికులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఉచిత బస్సు ప్రయాణ పథకం (కర్ణాటకలో శక్తి పథకం) అమలు, కేటాయించిన ఖర్చుతో పాటు వినియోగం, రవాణా వ్యవస్థలో తీసుకున్న చర్యల గురించి ప్రతినిధి బృందం ఆరా తీసింది. కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ అధికారుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించింది.

శక్తి పథకం గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు మంత్రుల బృందం బెంగళూరులోని శాంతినగర్ BMTC బస్టాండ్‌లో పర్యటించింది. ప్రయాణికుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. పథకం వల్ల ఎంత ప్రయోజనం ఉంది? ఎలా ఉపయోగపడుతోంది? అనే ప్రశ్నలు వేసి ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకున్నారు. "శక్తి పథకం వల్ల తమక మేలు జరిగిందని, గతంలో బస్ పాస్ కోసం ప్రతినెలా రూ.1200 చెల్లించేవాళ్లమని, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతో ప్రయోజనం పొందామని" ఓ మహిళా ప్రయాణికురాలు మంత్రులకు వెల్లడించింది.

మహిళలకు ఉచిత ప్రయాణం - ప్రభుత్వాన్ని ఆర్టీసీ ఏం కోరిందంటే?

"రైట్​, రైట్" మహిళలకు ఉచిత బస్సు​పై చంద్రబాబు కసరత్తు-అమలు ఎప్పట్నుంచంటే? - free bus for women

Last Updated : Jan 3, 2025, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.