Actress Renu Desai : విజయవాడలో ‘భారత చైతన్య యువజన పార్టీ’(BCY) ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవంలో సినీ నటి రేణూ దేశాయ్ పాల్గొని ప్రసంగించారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రేణూదేశాయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళల విద్య కోసం సావిత్రీబాయి పూలే్ ఎంతో కృషి చేశారని అన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్తూ.. సావిత్రీబాయి పూలే జయంతి కార్యక్రమం అని చెబితే వచ్చానని స్పష్టం చేశారు. తాను అందరి ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం సావిత్రీబాయి అని, మహిళల విద్య కోసం ఆమె ఎంతో కృషి చేశారని చెప్పారు.
"పిల్లలు తల్లిదండ్రులు కంటే ఉపాధ్యాయులతోనే ఎక్కువగా ఉంటారని, వాళ్లను సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది’’ అని రేణూదేశాయ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్యబ్రహ్మ, ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం, ‘భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ పాల్గొనగా ఉత్తమ సేవలందిచిన మహిళా ఉపాధ్యాయినులకు అవార్డులు ప్రదానం చేశారు.
'వాళ్ల నాన్న కోసం నా పిల్లలు ఇలా రెడీ అయ్యారు' - రేణూ దేశాయ్ ఎమోషనల్ - Renu Desai Instagram Post
పవన్ కల్యాణ్ విజయంపై స్పందించిన రేణూ దేశాయ్ - Pawankalyan Renudesai