రాజధాని ప్రాంతంలోని రహదారుల పనులు ప్రారంభం - చంద్రబాబు ప్రమాణ స్వీకారంలోగా పనులు పూర్తయ్యేలా చర్యలు - Capital Works Begins In Amaravati - CAPITAL WORKS BEGINS IN AMARAVATI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 1:44 PM IST
Andhra Pradesh Capital Works Begins In Amaravati : రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో సీఆర్డీఏ అధికారుల్లో చలనం వచ్చింది. రాజధాని ప్రాంతంలోని రహదారుల పనులను అధికారులు ప్రారంభించారు. రహదారుల పక్కన ఉన్న ముళ్ల చెట్లను తొలగిస్తున్నారు. ఈ పనులను సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో పరిశుభ్రత కార్యక్రమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులకు పూర్తి చేయడానికి 76 జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేశారు. అనంతరం రాయపూడిలో నిర్మాణంలో ఉన్న అమరావతి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఉన్న రాజధాని నిర్మాణ నమూనాలను పరిరక్షించాలని కమిషనర్ చెప్పారు. నిర్మాణ నమూనాలు ఉన్న భవనం వద్ద సెక్యూరిటీ గార్డ్స్ నియమించారు. ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే లోపు పనులను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.