LIVE: ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం - ప్రత్యక్ష ప్రసారం - AP Assembly Sessions - AP ASSEMBLY SESSIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 9:36 AM IST
|Updated : Jun 21, 2024, 1:56 PM IST
AP Assembly Sessions: కూటమి ప్రభుత్వం కొలువుదీరాక అసెంబ్లీ మొదటి సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ హోదాలో సభాపతి స్థానంలో ఆశీనులు కానున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించనున్నారు. తొలుత సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ప్రమాణం చేయిస్తారు. ఆ తరువాత వరుసగా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. గంటకు సగటున 25 మంది సభ్యుల ప్రమాణం చొప్పున 7 గంటల పాటు ఈ ప్రక్రియ సాగనుంది. సభ్యులందరి ప్రమాణం పూర్తయ్యాక స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. స్పీకర్ పదవికి నర్సీపట్నం ఎమ్మెల్యే, బీసీ సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేయనున్నారు. నూతన స్పీకర్ సభాపతి స్థానంలో కుర్చున్న తరువాత స్పీకర్‌ను ఉద్దేశించి తొలుత సభా నాయకుడైన చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడతారు. వాటికి స్పీకర్ సమాధానం ఇచ్చాక సభ నిరవధిక వాయిదా పడనుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jun 21, 2024, 1:56 PM IST