ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉచిత బస్సు సౌకర్యం కల్పించండి - సీఎం చంద్రబాబుకు దివ్యాంగుల వినతి - Divyang People Met CM Chandrababu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 20, 2024, 5:21 PM IST

divyang_people_met_chandrababu (ETV Bharat)

Anantapuram Divyang People Met CM Chandrababu : మహిళలకు ప్రభుత్వం అమలు చేయబోయే ఉచిత బస్సు సౌకర్యాన్ని తమకూ వర్తింపజేయాలని దివ్యాంగులు కోరుతున్నారు. అనంతపురానికి చెందిన దివ్యాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం (Divyang People petition to CBN) అందించారు. పెన్షన్‌ను 6 వేల రూపాయలకు పెంచినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురంలో దివ్యాంగులకు కేటాయించిన రీహాబిలిటేషన్ సెంటర్​ను పునరుద్ధరించాలని కోరారు. తమ కోసం ప్రత్యేక ఉపాధ్యాయుల్ని నియమించాలని కోరారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో దివ్యాంగులు తీవ్రంగా నష్టపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6 వేల రూపాయల పింఛను ఇస్తామని గతంలో చంద్రబాబు భరోసా ఇచ్చారు. అంతే కాకుండా వారి సమస్యలను పరిష్కరించి చేయూత అందిస్తామని స్పష్టం చేశారని అన్నట్లుగానే చంద్రబాబు తమను ఆదుకున్నారని దివ్యాంగులు అన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details