నాడు 89 లక్షల రేషన్ కార్డులు- నేడు 63 లక్షలే! 8 సరుకుల్లో ఇప్పడిచ్చేది బియ్యమే-జగన్ మోసమిదే - Anam Ramanarayana Reddy - ANAM RAMANARAYANA REDDY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 7, 2024, 6:01 PM IST
Anam Ramanarayana Reddy: ఎన్డీఏ కూటమికి చెందిన బీజేపీ, జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం గెలిపించేలా కృషి చేయాలని, ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండులో ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పేదలను ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 89 లక్షల రేషన్‌కార్డులు ఉండేవని తెలిపారు. రేషన్ కార్డులను జగన్ 63 లక్షలకు తగ్గించారని మండిపడ్డారు. గతంలో రేషన్ దుకాణంలో 8 రకాల సరుకులు ఇచ్చేవారని, ఇప్పుడు జగన్ రేషన్ దుకాణాలను బియ్యానికే పరిమితం చేశారని విమర్శించారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వక పథకాలు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయిని చంపిన వారిని సీఎం జగన్ దాచిపెడుతున్నారని ఆనం ఎద్దేవా చేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీలో ఉండి ఉన్నా, ప్రస్తుత ముఖ్యమంత్రి కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకుంటే ఆ మహానుభావుడు మా చేతికి చిప్పించాడంటూ మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలను సగానికి పైక కోత విధించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ మోసం చేశాడని మండిపడ్డారు.