తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : తెలంగాణలోని లోక్​సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్​ షా - Amit Shah Election Campaign - AMIT SHAH ELECTION CAMPAIGN

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 2:10 PM IST

Amit Shah Telangana Lok Sabha Election Campaign : లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా రాష్ట్రానికి వచ్చేశారు.  ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్​లో సిద్దిపేటకు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో బీజేపీ మెదక్​ లోక్​సభ అభ్యర్థి రఘునందన్​రావుకు మద్దతుగా నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో కేంద్ర ప్రభుత్వం పదేళ్లులో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలను వివరిస్తున్నారు. అలాగే గత బీఆర్​ఎస్​ సర్కారు అవినీతి అక్రమాలు, ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలు అంశాలపై రెండు పార్టీలను ఎండగడుతున్నారు. మరోసారి మోదీ ప్రభుత్వం కేంద్రంలో రావాల్సిన అవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. బహిరంగ సభ ముగించుకుని హెలికాప్టర్​లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడే భోజనం పూర్తి చేసిన అనంతరం ప్రత్యేక విమానంలో భువనేశ్వర్​ బయలుదేరి వెళ్లనున్నారు.

ABOUT THE AUTHOR

...view details