ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాజధాని తరలిపోతే భావితరాలకు తీవ్రనష్టం: అమరావతి రైతులు - Amaravati Farmers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 11:42 AM IST

Amaravati Women Farmers campaign in Firangipuram Mandal : అమరావతి రాజధాని తరలిపోతే భావితరాలకు తీవ్ర నష్టం కలుగుతుందని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) కన్వీనర్​ పువ్వాడ సుధాకర్​ పేర్కొన్నారు. సీఎం జగన్​ మాటలు నమ్మి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని వేములూరిపాడు, అమీనాబాద్​ గ్రామాల్లో గురువారం సాయంత్రం జేఏసీ సభ్యులు పర్యటించారు. 'ఆంధ్రప్రదేశ్​ను-అమరావతి రాజధాని కాపాడుకుందాం-కలిసి రండి కదలి రండి' అని నినాదాలు చేశారు. మహిళలు ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు.

సీఎం జగన్​ మోహన్​ రెడ్డికి మరో అవకాశం ఇస్తే విశాఖను రాజధాని చేస్తే అమరావతి రైతులు నష్టపోతారని పువ్వాడ సుధాకర్​ వ్యాఖ్యానించారు. సీఎం జగన్​ ఇంటికి పంపించడానికి రాష్ట్రం ప్రజలు సిద్ధంగా ఉన్నారని అమరావతి మహిళ రైతులు పేర్కొన్నారు. జగన్​ అయిదేళ్ల పరిపాలన గుంతల రోడ్డులతో, ప్రభుత్వ కార్యాలయాన్ని తాకట్టు పెడుతూ రాష్ట్రాన్ని భ్రఘ్ట పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో దళితులు, బడుగు బలహీనవర్గాలు, ముస్లింలకు అన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అమరావతి రాజధాని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details