ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చట్టప్రకారమే అమరావతి రాజధానిపై తీర్పు వెలువరించా: జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ - Farmers Met Justice Rakesh Kumar - FARMERS MET JUSTICE RAKESH KUMAR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 9:14 AM IST

Amaravati Farmers Met in Former HC Justice Rakesh Kumar : అమరావతి రాజధానిపై చట్టప్రకారమే గతంలో తీర్పు వెలువరించినట్లు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ తెలిపారు. రాజధాని ప్రాంత రైతులు విజయవాడలోని స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తిగా తన వృత్తి ధర్మం పాటించినట్లు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు ప్రజల హక్కులను పరిరక్షించేలా అనేక తీర్పులిచ్చానన్నారు. నా తీర్పుల వల్ల అమరావతి రైతులు, ప్రజలకు ప్రయోజనం కలగడం ఆనందంగా ఉందని రాకేష్‌కుమార్‌ అన్నారు.  

వైఎస్సార్సీపీ పాలనలో పోలీసులు చట్టాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అమరావతి రైతులు, మహిళలకు జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ఇచ్చిన తీర్పులు ధైర్యాన్ని ఇచ్చాయన్నారు. ఇష్టం వచ్చినట్లు 144 సెక్షన్‌ అమలు చేస్తే జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ నిజాయతీగా తీర్పులు ఇచ్చారని రైతులు గుర్తు చేశారు. రాకేష్​ కుమార్​ తీర్పుల ద్వారా తమకు మేలు కలిగిందని 2020 డిసెంబరులో పదవీ విరమణ చేసినప్పుడు రాజధాని రైతులు, మహిళలు సీడ్‌యాక్సెస్‌ రోడ్డుపై మానవహారంగా నిలబడి వీడ్కోలు పలికారు. 

ABOUT THE AUTHOR

...view details