Live: అమరావతి డ్రోన్ సమ్మిట్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - AMARAVATI DRONE SUMMIT 2024
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 22, 2024, 10:29 AM IST
|Updated : Oct 22, 2024, 1:14 PM IST
Amaravati Drone Summit 2024 Live : ఏపీని డ్రోన్ హబ్‌గా తీర్చిద్దటమే లక్ష్యంగా జాతీయస్థాయి డ్రోన్ సమ్మిట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వేదికగా రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సును సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా , సీఐఐ భాగస్వామ్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డ్రోన్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ఇప్పటి వరకూ 6929 మంది నమోదు చేసుకున్నారు. డెలిగేట్స్, డ్రోన్ హ్యాకథాన్, ఎగ్జిబిషన్ , స్పీకర్స్ విభాగాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నారు. సమ్మిట్‌లో మొత్తం 9 అంశాల్లో సెషన్లు, చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు. ఇన్వెస్టర్లు, ఇన్వెంటర్లు, డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. దీంతో పాటు డ్రోన్ హ్యాకథాన్‌ను నిర్వహిస్తారు. నాలుగు విభాగాల్లో విజేతలను ఎంపిక చేసి 24 లక్షల రూపాయల బహుమతుల్ని ప్రదానం చేయనున్నారు. డ్రోన్ సమ్మిట్‌లో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రెండు అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోనుంది.
Last Updated : Oct 22, 2024, 1:14 PM IST