ETV Bharat / state

ఐడియా అదుర్స్​ - ఇంటి దగ్గరకే వచ్చి కుట్టేస్తున్నాడు - MOBILE TAILORING

సమస్యలోనే పరిష్కార మార్గాన్ని అన్వేషించిన టైలర్ - ప్రజలకు తమదైన రితీలో సేవలందిస్తూ ఆదాయార్జన

Mobile_Tailoring
Mobile Tailoring (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2025, 10:36 PM IST

Mobile Tailoring Employment: ఆయన ఓ సాధారణ దర్జీ. అయిదు పదుల వయస్సు. వృత్తే జీవనాధారం. కాలక్రమేనా వచ్చిన మార్పులు ఆదాయానికి గండి కొట్టింది. ఫలితంగా కష్టాల పాలయ్యాడు. అందరిలా మరో వృత్తి ఎంచుకోలేదు. సమస్యలోనే పరిష్కార మార్గాన్ని అన్వేషించిన ఆయన, వినూత్నంగా వృత్తి సేవలను అందించాలని నిర్ణయించాడు. అన్ని సేవలు ఇంటివద్దకు వస్తున్న ప్రస్తుత కాలంలో తమ సేవలను ప్రజల ఇంటి గుమ్మం వద్దకు తీసుకెళ్తున్నాడు. తద్వారా ప్రజలకు తమదైన రితీలో సేవలందిస్తూ ఆదాయార్జన చేస్తూ గౌరవంగా జీవనం సాగిస్తున్నాడు. ఆ పెద్దాయనకు వచ్చిన కష్టాలేంటి, దాన్నేలా అదిగమించారో ఈ కథనంలో చూద్దాం.

రోడ్డు పక్కన ఓ బైక్​కు కుట్టుమిషన్​ను తగిలించుకుని, కళ్లద్దాలు పెట్టుకుని బట్టలు కుడుతూ జీవనం సాగిస్తున్నారు షేక్ కాలేషా. ఈయన వయసు 50 ఏళ్లుపైనే ఉంటాయి. భార్య మీరాబితో కలిసి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో కొన్నేళ్లుగా నివాసముంటున్నారు. తొలుత గ్రామంలో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకుని టైలరింగ్ చేసేవారు. దశాబ్ద కాలం వరకూ కుటుంబ పోషణకు ఏ మాత్రం ఇబ్బంది పడేవారు కాదు. ఇద్దరు పిల్లలతో గౌరవంగా జీవించేవారు. గ్రామస్థులు కాలేషా దుకాణం వద్దకు వచ్చి బట్టలు కుట్టించుకునేవారు.

ఈ టైలర్ మీ ఇంటికే వస్తాడు - మొబైల్ టైలరింగ్​తో కొత్త మార్గాన్ని ఎంచుకున్న కాలేషా (ETV Bharat)

ఇంటి వద్దకే టైలరింగ్ సేవలు: పండుగలు, ప్రత్యేక రోజులు వస్తే ఆదాయం రెట్టింపయ్యేది. కాలం మారింది. తరం మారడంతో వారి అభిరుచులూ మారుతున్నాయి. నేటి తరం యువత అంతా ఇప్పుడు ట్రెండ్ మార్చి రెడీమేడ్ దుస్తులను ధరిస్తున్నారు. దీంతో కాలేషాకు గిరాకీ గణనీయంగా తగ్గుతూ వచ్చింది. కొంత మంది బట్టలు కుట్టించుకున్నా ఇచ్చే మొత్తం కంటే, అప్పులు పెట్టేదే ఎక్కువైంది. దీంతో కుటుంబ పోషణ కష్టమైంది. వృత్తినే నమ్ముకుని జీవించే ఆయన, వృత్తి ద్వారానే ఏదో విధంగా ఆదాయం పెంచుకోవాలని భావించారు. ప్రస్తుతం పలు రకాల సేవలూ ఇంటి వద్దకే వస్తున్నాయి. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటంతోపాటు సంస్థల వ్యాపారాభివృద్ది గణనీయంగా పెరుగుతోన్న వైనాన్ని తెలుసుకున్నారు.

తానూ ఇంటి వద్దకే సేవలందించి ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. మొబైల్ టైలరింగ్ ద్వారా ఉపాధి పొందాలనుకున్నాడు. నాలుగు చక్రాల వాహనం అవసరమైనా, కొనే స్తోమత లేకపోవడంతో ఓ రిక్షాను కొని దానికి కుట్టుమిషన్​ను అనుసంధానించారు. ఎక్కడికైనా తీసుకుని వెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేశారు. తొలుత తన గ్రామంలోని కాలనీలు తిరిగి ఇంటివద్దకే వెళ్లి పాత, చిరిగిన బట్టలు కుట్టడం ప్రారంభించారు. దీనికి వారిచ్చిన పదో పరకో తీసుకుని కుటుంబ పోషణ చేస్తున్నారు. స్నేహితులు, సన్నిహితుల సహాయంతో టీవీఎస్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేసి దాని సాయంతో పొరుగూళ్లకూ సేవలు విస్తరించారు.

స్కూల్స్, ఆఫీసుల్లోని టాయిలెట్స్​ క్షణాల్లో క్లీన్​ - ​అదిరిపోయే మాస్టర్ ప్లాన్!

రోజుకు 500 వరకూ వస్తోంది: పెనమలూరు మండలంలో రోజుకో గ్రామం చొప్పున తిరుగుతూ ఉపాధి పొందుతున్నారు. అవసరం ఉన్న వాళ్లు కాలేషాకు ఫోన్ చేసి మరీ పిలింపించుకుని బట్టలు కుట్టించుకుంటారు. అలా రోజుకు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు సంపాదిస్తున్నారు. మొబైల్ టైలరింగ్ వల్ల అప్పులు బాధలు ఉండవని, నగదు జేబులోకి వస్తోందని అంటున్నారు షేక్ కాలేషా. తన కష్టానికి ప్రతిఫలం లభిస్తోందని కాలేషా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వృత్తిని ఆదరించడం లేదని ఎవరూ ఆందోళన చెందవద్దని, వినూత్నంగా ఆలోచించి సేవలందిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

ఐదు పదుల వయసులోనూ షేక్ కాలేషా పలు గ్రామాలు తిరుగుతూ మొబైల్ టైలరింగ్ ద్వారా సేవలందించడం చూసి ఆయా గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. వృత్తి పట్ల నిబద్దతతో మెరుగైన సేవలందించడాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దుకాణాలకు వెళ్తే పెద్దలు, పిల్లలు ధరించిన, లేదా చిరిగిన దుస్తులను సరిచేసేందుకు టైలర్లు నిరాకరిస్తున్నారని, దీంతో నిరుపయోగంగా ఉంచాల్సిన పరిస్ధితి ఉంటుందని అంటున్నారు. ఇంటివద్దకే వచ్చి తమ కుటుంబాలకు చెందిన పాత బట్టలను, తక్కువ ధరలోనే కుడుతూ సేవలందించడం అభినందనీయమని గ్రామస్థులు తెలిపారు.

"షాపు పెట్టాను కానీ సరిగ్గా నడవలేదు. అప్పులు అయిపోవడంతో తొలుత రిక్షా కొని ఇంటింటికీ వెళ్లేవాడిని. తరువాత దానిని తొక్కలేక, కొంతమంది సాయం చేయడంతో ఈ బైక్​ కొనుక్కున్నాను. ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. అన్నీ కుడతాను. ఎవరైనా ఫోన్ చేస్తే అక్కడకి వెళ్లి పని చేస్తాను". - షేక్ కాలేషా, మొబైల్ టైలర్

మరోసారి వార్తల్లో చింతమనేని- ఖరీదైన శాలువాలతో పేదలకు దుస్తులు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.