LIVE : ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతల స్వీకరణ - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU LIVE - CHANDRABABU LIVE
Published : Jun 13, 2024, 4:15 PM IST
|Updated : Jun 13, 2024, 5:32 PM IST
Amaravathi Farmers Grand welcome to Chandrababu Live : ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు, ఇచ్చిన హామీలపై తొలి సంతకాలను చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తారు. ఆయా విద్యాసంస్థల్లో 13 వేలకు పైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రాథమికంగా నివేదిక రూపొందించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి, అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపుపై మూడో సంతకం చేయనున్నారు. నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపైనా సంతకాలు పెట్టనున్నారు. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లో ఈ సాయంత్రం 4:41 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకోసం ఛాంబర్‌ను సర్వాంగ సుందరంగా అధికారులు తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో అమరావతి చేరుకున్న చంద్రబాబుకు రైతులు ఘన స్వాగతం పలికారు.
Last Updated : Jun 13, 2024, 5:32 PM IST