ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు- నామినేషన్​ దాఖలు చేసిన కూటమి నేతలు - SPEAKER AYYANNA PATRUDU - SPEAKER AYYANNA PATRUDU

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 2:52 PM IST

Alliance Leaders Filed The Speaker Nomination: ఏపీ శాసనసభ స్పీకర్‌ పదవి కోసం టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున కూటమి నేతలు నామినేషన్‌ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్ పాల్గొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. శాసనసభను ప్రొటెం స్పీకర్‌ బుచ్చయ్య చౌదరి రేపటికి వాయిదా వేశారు.

రేపు ఉదయం పదిన్నరకు సభ తిరిగి ప్రారంభం కానున్నట్లు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నేడు 172 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాలతో ముగ్గురు ప్రమాణస్వీకారం చేయలేదు. వారిలో పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు, జీవీ ఆంజనేయులు ఉన్నారు. ఆ ముగ్గురితో శనివారం ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణం చేయని ముగ్గురితో బుచ్చయ్యచౌదరి రేపు ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత శాసనసభ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details