ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డు అందుకోనున్న చిరంజీవి - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 3 hours ago

ANR National Award Program: 2024 గానూ ఏయన్నార్‌ జాతీయ పురస్కార వేడుకల (ANR National Award) ప్రధానోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరుగుతోంది. ఈ ఏడాది అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇస్తున్నట్లు హీరో నాగార్జున గతంలోనే ప్రకటించారు. ఇవాళ పురస్కారం ప్రదానం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిగ్​ బీ అమితాబా చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు.  అక్కినేని జాతీయ పురస్కార వేడుకలకు దర్శకులు రాఘవేందర్ రావు, నిర్మాత  అశ్వినీదత్, నిర్మాత అల్లు అరవింద్, హీరోలు వెంకటేశ్, రామ్ చరణ్, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు స్మారకంగా ప్రతి ఏటా చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన వారికి, హీరో నాగార్జున ఏయన్నార్‌ స్మారక పురస్కారం ఇస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సందడిగా సాగుతున్న ఈ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీరూ వీక్షించండి.  
Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details