పువ్వులు దొరకలేదా జగన్- అగ్రిగోల్డ్ బాధితుల ఫ్లవర్ పార్శిళ్లు - Agrigold victims fire on cm jagan - AGRIGOLD VICTIMS FIRE ON CM JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 7, 2024, 4:16 PM IST
Agrigold Victims Fire on CM Jagan : అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు పువ్వుల్లో పెట్టి ఇస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి మాట తప్పరని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈవీ నాయుడు మండిపడ్డారు. ఈ ఐదేళ్ల పాలనలో జగన్‌కి పువ్వులే దొరకలేదేమోనని విమర్శించారు. అందుకే బాధితుల తరపున మేమే సీఎంకు పువ్వులు పంపిస్తున్నామని తెలిపారు. ఈరోజు మన్యం జిల్లా ఏఐటీయూసీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈనీ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అగ్గిగోల్డ్ బాధితుల శిబిరం వద్దకు వచ్చి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో అందరికి న్యాయం చేస్తానని మాటిచ్చారు.
అంతేగాక చంద్రబాబు నాయుడు హయాంలో అగ్రిగోల్డ్ మృతుల కుటుంబాలకు మూడు లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించారు. దానికి మరో ఏడు లక్షలు కలిపి మెుత్తం 10లక్షల రూపాయలు పువ్వుల్లో పెట్టిఇస్తానని చెప్పాడని గుర్తుచేశారు. మరి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు గడిచిని పువ్వులు దొరకలేదేమోనని విమర్శించారు. జగన్ మాటలు నమ్మి దాదాపు 19లక్షల అగ్రిగోల్డ్ బాధితులు వైసీపీకే ఓటు వేశారని తెలిపారు. కానీ జగన్ మాత్రం ఇచ్చిన మాటతప్పి బాధితులందరిని మోసం చేశారని మండిపడ్డారు. అందుకే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి అగ్రిగోల్డ్ బాధితుల తరపున పువ్వులను ప్రార్శిల్ చేసి కొరియర్‌లో పంపిస్తున్నామని ఈవీ నాయుడు తెలిపారు.