LIVE : అల్లు అర్జున్‌ను పరామర్శిస్తున్న సినీ ప్రముఖులు - ప్రత్యక్ష ప్రసారం - ACTOR ALLU ARJUN RELEASE
By ETV Bharat Andhra Pradesh Team
Published : 4 hours ago
Actor Allu Arjun Released Live : హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అరెస్టయిన అల్లు అర్జున్ విడుదలపై అర్ధరాత్రి వరకు ఉత్కంఠత కొనసాగగా ఆయన ఇవాళ ఉదయం విడుదల అయ్యారు. చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌ను అధికారులు జైలు వెనుక గేటు నుంచి పంపించారు. ఎస్కార్ట్ వాహనం ద్వారా వెళ్లిన అల్లు అర్జున్‌ను నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు ఎవరూ రాకుండా ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తొలుత నాంపల్లి న్యాయస్థానం రిమాండ్ విధించగా పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అనంతరం హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10.30 గంటలకు అందడంతో అర్జున్‌ను చంచల్‌గూడ జైల్లోనే ఉంచారు. అయితే బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు ఆలస్యంగా అందాయి. దీంతో ఆయన నేడు విడుదలయ్యారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆయనను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి ప్రత్యక్షప్రసారం