తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఏబీవీపీ నిరసనలో పోలీసుల ఓవరాక్షన్ - మహిళ కార్యకర్త జుట్టుపట్టుకొని - ఏబీవీపీ నాయకుల ధర్నా

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 10:37 PM IST

ABVP Leaders Protest in Rangareddy : రంగారెడ్డి జిల్లాలోని వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దనీ, జీఓ నెంబర్ 55ను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ(ABVP Leaders Protest) శంషాబాద్ కమిటీ నిరసన చేపట్టింది. విద్యార్థుల నిరసనకు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మద్దతు పలికారు. ఈ నిరసనను పోలీసులు అడ్డుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో నాయకురాలిను నిలువరించేందుకు మహిళా కానిస్టేబుల్స్​ ద్విచక్ర వాహనంపై వెళ్తూ జుట్టు పట్టుకున్నారు. దీంతో ఆమె కింద పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు విద్యార్థులు ప్రవర్తిస్తున్న తీరుపై ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

100 Acres Allotment to Telangana High Court : కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తరవాత రాష్ట్ర హైకోర్టు నూతన భవనాన్ని నిర్మించేందుకు 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఈ నెల 5న జీఓ విడుదల చేసింది. బుద్వేల్​లోని వ్యవసాయ, ఉద్యాన విద్యాలయానికి 1966లో ఉన్న అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూమిలో 100 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవన నిర్మాణం జరిగినంత వరకు పాత హైకోర్టు భవనంలోనే కార్యకలాపాలు జరుగుతాయని వెల్లడించింది. 

ABOUT THE AUTHOR

...view details