బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ - దొంగతనం అంటే అంత ఈజీ కాదు బ్రదరూ!! - MANCHERIAL THEFT VIDEO VIRAL - MANCHERIAL THEFT VIDEO VIRAL
Published : Jul 1, 2024, 11:41 AM IST
Mancherial Theft CCTV Records : రోజురోజుకు దొంగలు చెలరేగిపోతున్నారు. ఇంటికి తాళం కనిపించిదంటే చాలు చేతికి పని దొరికిందని సంబురపడుతున్నారు. ఇల్లు లూఠీ చేసే వరకు మనశ్శాంతి లభించదనుకుంటూ చోరీలకు పాల్పడుతున్నారు. ఇళ్లలో చోరీలకు తెగబడుతూ దొరికినకాడికి దోచుకుని పోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా ఓ దొంగ చోరీకి విఫల ప్రయత్నం చేశాడు.
మంచిర్యాల జిల్ల సూర్యనగర్ రోడ్‌లోని ఓ విశ్రాంతి ఉద్యోగి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్దకు చేరుకున్న ఇద్దరు దుండగులు ఇంటికి తాళం వేసి ఉండడంతో తీయడానికి తెగ ప్రయత్నించారు. సీసీటీవీ కెమెరా ఉండదనుకున్నట్లు ఉన్నారు. ముఖానికి మాస్క్ కూడా వేసుకోకుండా ముఖం కవర్ చేసుకోవడానికి తిప్పలు పడుతూ తాళం తీయడానికి విఫల యత్నం చేశారు. కానీ తాళం తెరుచుకోకపోయే సరికి వెనుదిరిగాడు.దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చోరీకి వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి రావాలిగా బ్రో, ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.