తెలంగాణ

telangana

నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు - కొట్టుకుపోయిన 40 గ్రామాలను కలిపే కనెక్టివిటీ రోడ్డు - Road Washed Away in Nalgonda

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 5:07 PM IST

HEAVY RAINS IN NALGONDA (ETV Bharat)

Nalgonda District Bridge: నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామం వద్ద వంతెన నిర్మాణం పూర్తి కాక పోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టిరోడ్డు భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. మూడేళ్ల క్రితం వంతెన నిర్మాణ పనులను చేపట్టిన కాంట్రాక్టర్ సకాలంలో పూర్తి చేయలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు ప్రజలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డు మార్గం సరిగా లేక తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోందని స్కూల్​కు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు వాపోతున్నారు.   

దాదాపు 40 గ్రామాలకు కనెక్టివిటీగా ఉన్న ఈ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాహనదారులు తరచూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇదే మాదిరి రెండుసార్లు తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో మట్టితో మరమ్మతులు చేశారు. వంతెన నిర్మాణ పనులను నల్గొండ ఎంపీ రఘవీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు పరిశీలించారు. వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ప్రజలు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details