ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హైవేపై పేలిన పెట్రోల్ ట్యాంకర్ టైర్ - భారీగా చెలరేగిన మంటలు - petrol tanker burst into flames

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 10:52 PM IST

A Petrol Tanker Burst into Flames in Kakinada District (ETV Bharat)

Petrol Tanker Burst into Flames in Kakinada District : కాకినాడ జిల్లా తాళ్లరేవు వద్ద 216 జాతీయ రహదారిపై పెట్రోల్ ట్యాంకర్ టైర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి యానాంకు 30 వేల లీటర్లు పెట్రోల్ తీసుకు వస్తున్న ట్యాంకర్ తాళ్లరేవు పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు చేరుకునేసరికి వెనక టైర్ పేలడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీనిని గ్రహించిన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కగా నిలిపివేశాడు. పేలిన టైర్ నుంచి మంటలు రావడంతో స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

వెంటనే యానం నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ఫోమ్ లిక్విడ్ పంపింగ్ చేయడం ద్వారా మంటలను అదుపు చేయడంతో పాటు ట్యాంకర్ వేడెక్కకుండా నీటిని వెదజల్లారు. అలాగే కాకినాడ నుంచి వచ్చిన మరో వాహనం ద్వారా ట్యాంకర్​లో ఉన్న పెట్రోల్​కు ఏ విధమైన వేడి తగలకుండా సుమారు రెండు గంటల పాటు నీటిని వెదజల్లుతూ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ట్యాంకర్​కు మంటలు అంటుకుని ఉంటే భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ముందుగానే సమీప ప్రజలను అధికారులు వేరే ప్రాంతానికి తరలించారు. జాతీయ రహదారిపై వాహనాలను దారి మళ్లించారు. భారీ ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details