మద్యం మత్తులో యువకుడి కారు డ్రైవింగ్ - పలువురికి స్వల్పగాయాలు - Car Hulchul in Hanumakonda - CAR HULCHUL IN HANUMAKONDA
Published : Aug 30, 2024, 5:08 PM IST
Drunk Man Hulchul with Car in Hanumakonda : హనుమకొండ జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. హంటర్ రోడ్డులోని న్యూశాయంపేట వద్ద మద్యం మత్తులో ఓ యువకుడు కారు నడుపి రహదారి పక్కన ఉన్న వాహనాలను ఢీ కొడుతూ పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వాహనంతో పాటు మద్యం మత్తులో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇతరుల ప్రాణాల ముప్పునకు కారకులుగా : గాయపడిన వారిని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవైపు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తుండగా మరోవైపు నిబంధనలు పాటించకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పునకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులవుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి ప్రయాణించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అక్కడున్న స్థానికులు అంటున్నారు.