తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఏకశిల సౌందర్యం భళా - మంచిర్యాలలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్​ - Gontemma Gutta in Bellampalle - GONTEMMA GUTTA IN BELLAMPALLE

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 2:11 PM IST

Mancherial Tourist Places : ప్రకృతిలో మమేకమై రెండు కళ్లతో వీక్షిస్తే ప్రతి దృశ్యం ఆహ్లాదకరమే. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓ ఏకశిల దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. చుట్టు కొండలు, చెట్లతో పరచుకున్న పచ్చదనం మధ్యలో నీరు అందులో చూపరులను కట్టిపడేసే ఓ ఏకశిల. ఈ ప్రకృతి సౌందర్య దృశ్యం కన్ను రెప్ప వేయనీయకుండా చేస్తోంది. ఆ అందాలను ప్రకృతి సొబగులను చూస్తుంటే మనసు పులకరిస్తోంది. 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రైల్వే స్టేషన్ ప్రాంతం దగ్గరలో ఈ ఏకశిల ఉంది. ఇక్కడ గొంతెమ్మ గుట్టను బండ కోసం తొలవగా మిగిలిన గుట్ట ఇలా ఏకశిలగా మిగిలిపోయింది. ఆ ప్రాంతంలో పచ్చని కొండలు, నీళ్ల మధ్యలో గొంతెమ్మ గుట్ట సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడే గొంతెమ్మ గుట్ట పోచమ్మ ఆలయం ఉంది. భక్తులు నిత్యం ఇక్కడికి వచ్చి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇక్కడి నుంచి వీక్షిస్తుంటే గొంతెమ్మ గుట్ట అందాలు మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details