జొన్నలు చెరుగుతుండగా కిందపడిన విత్తనం - ఏకంగా 17 అడుగులు పెరిగిన మొక్క - 17 feet tall sorghum plant - 17 FEET TALL SORGHUM PLANT
Published : Aug 19, 2024, 1:56 PM IST
Sorghum Plant in Wanaparthy : సాధారణంగా పంట పొలాల్లో జొన్న మొక్క అయిదారు అడుగులు మాత్రమే పెరుగుతుంది. కానీ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల గ్రామానికి చెందిన వాకిటి నాగరాజు ఇంటి ఆవరణలోని జొన్న మొక్క ఏకంగా 17 అడుగుల ఎత్తు పెరిగి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మూడు నెలల క్రితం ఇంటి వద్ద జొన్నలను చెరుగుతుండగా కింద పడిన విత్తనం మొలకెత్తి ఇలా పెరిగిందని నాగరాజు తెలిపారు. ఆవరణలో ఎర్రమట్టి, చెరువు ఒండ్రు మట్టి కలిపి వేసినట్లు ఆయన వెల్లడించారు. ఇదే ఆవరణలో మరో జొన్న మొక్క ఉండగా ఈ మధ్యే దానికి ఆరు కంకులు కాశాయని చెప్పారు. ఒండ్రు మట్టిలో పుష్కలంగా పోషకాలు ఉండటం వల్ల మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుందని మండల వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతు నాగరాజు మాట్లాడుతూ జొన్న మొక్కకు ఎలాంటి రసాయన ఎరువులు వేయలేదని, సేంద్రియ పద్దతులతోనే ఈ మొక్క దాదాపు 17 అడుగుల పొడపు పెరిగిందని అన్నారు.