LIVE : గోల్కొండ కోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - Independence Day Celebrations Live - INDEPENDENCE DAY CELEBRATIONS LIVE
Published : Aug 15, 2024, 9:56 AM IST
|Updated : Aug 15, 2024, 11:06 AM IST
Independence Day Celebration in Telangana : రాష్ట్రవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న పంద్రాగస్టు ఇది. స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రులు, ఉన్నతాధికారులు, నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా 1200 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. గోల్కొండ వద్ద విధుల్లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు పాల్గొన్నాయి. ఇప్పటికే కోటను ఘనంగా విద్యుత్ దీపాలతో ధగధగమనిపించేలా అలంకరణ చేశారు. త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింభించేలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు దేదీప్యమానంగా వెలిగేలా ముస్తాబు చేశారు. మువ్వన్నెల కాంతుల సొబగులతో గోల్కొండ ఖిల్లా చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Last Updated : Aug 15, 2024, 11:06 AM IST