విశాఖలో వైసీపీ నేతలు రూ.3వేల కోట్ల భూ కుంభకోణం చేశారు-జనసేన నేత పీతల - land scam in YCP government - LAND SCAM IN YCP GOVERNMENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 10:51 PM IST
3000 Crore Land Scam Took Place in Visakhapatnam During YCP Govt : విశాఖలో మాజీ సీఎం జగన్ కార్యదర్శి అయిన కెఎన్ఆర్, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిలు 3వేల కోట్ల భూకుంభకోణం చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్సీసీ(NCC) భూముల్లో మాస్టర్ ప్లాన్లకు విరుద్ధంగా 80అడుగులు అదనంగా కట్టి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఇంత జరుగుతున్న ఏకంగా 600 కోట్ల టీడీఆర్ ఇవ్వడానికి విశాఖ మహానగర పాలక సంస్థ అధికారులు సిద్ధమవ్వడంపై పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. కనీసం రూపాయి కూడా కట్టాకుండానే టీడీఆర్ కోసం రోడ్ ప్లాన్ కూడా జీవీఎంసీ అధికారులు సిద్ధం చేశారని విమర్శించారు.
ఇప్పటికే ఎన్సీసీ భూమికి 17 కోట్లు పెట్టి రోడ్డును జీవీఎంసీ వేస్తోందని అన్నారు. ఈ ప్రక్రియలో మేయర్ హరి వెంకట కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య అధికారి శ్రీ లక్ష్మీ పావులు కదిపారని చెప్పారు. ఈ భూములు వ్యవహారం చూసుకున్నాందుకే కొట్టు సత్యనారాయణకు అప్పట్లో డిప్యూటీ సీఎం పదవి వచ్చిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చినా వైసీపీకి తొత్తుగా జీవీఎంసి కమిషనర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణ జరిపించాలని పీతల మూర్తియాదవ్ డిమాండ్ చేశారు.