ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పిఠాపురంలో తనిఖీలు- రూ.17కోట్ల ఆభరణాలు, వాహనం సీజ్ - 17 crore worth of gold seized - 17 CRORE WORTH OF GOLD SEIZED

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 4:58 PM IST

17 Crore Worth of Gold Seized in Pitapuram : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద బంగారు, వెండి ఆభరణాలను తరలిస్తున్న వాహనాన్ని S.S.T. అధికారులు పట్టుకున్నారు. తనిఖీలు చేపట్టిన అధికారులు విశాఖ నుంచి కాకినాడ వస్తున్న సీక్వెల్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన వాహనాన్ని పట్టుకుని 17కోట్ల రూపాయల విలువచేసే ఆభరణాలను సీజ్ చేశారు. వాటికి సరైన ధ్రువపత్రాలు చూపకపోవడం, తరలించే వ్యక్తుల పేర్లూ పత్రాల్లో నమోదు చేయకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసి పిఠాపురం తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. పంచనామా అనంతరం ఖజానా కార్యాలయానికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చెక్​పోస్టుల వద్ద పోలీసులు సోదాలు తీవ్రతరం చేశారు. ఓటర్లకు తాయిలాలు అందించే సమయ దగ్గరపడడంతో చెక్ పోస్టుల వద్ద భారీగా బలగాలను మొహరించారు. దీనికితోటు సమాచారం ఇచ్చేందుకు సీ విజల్ యాప్ కూడా ఉంది. మరోవైపు ఫ్లయింగ్ స్వ్కాడ్ దూకుడు పెంచాయి. ఇలా కట్టుదిట్టమైన చర్యలతో భారీ ఎత్తున బంగారం డబ్బుల తరలింపులను అడ్డుకోగలుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details