తెలంగాణ

telangana

ETV Bharat / technology

కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ వార్నింగ్​.. ఇకపై అలాంటి టైటిల్స్, థంబ్​నెయిల్స్​ పెడితే చర్యలు తప్పవ్! - YOUTUBE CLICKBAIT TITLES

విచ్చలవిడి టైటిల్స్​, థంబ్​నెయిల్స్​.. ఇండియాలో యూట్యూబ్ కొత్త నిబంధనలేంటో​ తెలుసా?

Youtube
Youtube (Photo Credit- Youtube)

By ETV Bharat Tech Team

Published : Dec 22, 2024, 6:51 PM IST

Youtube Remove Videos With Clickbait Titles:ప్రస్తుతంప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్ యూట్యూబ్​ అత్యధిక ప్రజాదరణతో దూసుకుపోతోంది. చాలామంది కంటెంట్ క్రియేటర్లు తమ క్రియేటివిటీతో మంచి రెవెన్యూను సంపాదించుకునేందుకు యూట్యూబ్​ను వేదికగా చేసుకుంటున్నారు. అందుకే యూట్యూబ్​లో కోట్ల కొద్దీ వీడియోలు దర్శనమిస్తూ ఉంటాయి. అయితే కొంతమంది యూట్యూబర్లు డబ్బును సంపాదించుకునేందుకు తప్పుడు మార్గాలను అనుసరిస్తున్నారు.

మిస్​లీడింగ్ థంబ్ నెయిల్స్, టైటిల్​తో సంబంధం లేని వీడియోలను అప్​లోడ్ చేయడంతో అవి ఓపెన్ చేసిన వ్యూయర్స్ నిరాశకు గురవుతున్నాయి. దీంతో యూట్యూబ్ విశ్వనీయత దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో అలాంటి వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని యూట్యూబ్ నిర్ణయించింది. వినియోగదారుల సమయాన్ని వృథా చేసే కంటెంట్ ఉన్న వీడియోలను తొలగించేందుకు కసరత్తు చేస్తోంది.

ముఖ్యంగా భారత్​లో తప్పుదారి పట్టించే టైటిల్స్, థంబ్​నెయిల్స్​లతో ఉన్న వీడియోలను గుర్తించి వాటిని 'క్లిక్‌బైట్'గా పరిగణిస్తామని ప్రకటించింది. వాటిలో మొదటి ప్రాముఖ్యత న్యూస్, కరెంట్ అఫైర్స్​కు సంబంధించిన మిస్​లీడింగ్ కంటెంట్​కు ఇస్తామని తెలిపింది. ఇలాంటి మిస్​లీడింగ్ కంటెంట్​ను గుర్తించి తొలగించడం ద్వారా తమ ప్లాట్​ఫారమ్​పై వినియోగదారుల విశ్వసనీయతను కొనసాగించాలని నిర్ణయించుకుంది.

ఉదాహరణకు.. 'ప్రెసిడెంట్ రాజీనామా చేశారు!' వంటి టైటిల్​ ఉన్న వీడియోలు ఎక్కుగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. అయితే వీడియోలో మాత్రం రాజీనామా గురించి చర్చించకుండా టైటిల్​కి సంబంధం లేని కంటెంట్​ను పోస్ట్​ చేస్తే అలాంటి వాటిని 'Exaggerated Clickbait' అనే కేటగిరీగా పరిగణిస్తామని తెలిపింది. తద్వారా అలాంటి వీడియోలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే 'టాప్ పొలిటికల్ న్యూస్' అని థంబ్​నెయిల్స్​ పెట్టి వాటిలో కూడా సంబంధం లేని న్యూస్ ఉంటే వాటిని కూడా తీసేస్తామని తెలిపింది.

మరికొద్ది నెలల్లో ఇండియాలో యూట్యూబ్ ఈ కఠినమైన చర్యలను అమలు చేయాలని చూస్తుంది. కొత్త నిబంధనలు దశలవారీగా రూపొందిస్తామని కంపెనీ తెలిపింది. అంటే ఇలాంటి మిస్​లీడింగ్ కంటెంట్​ను క్రియేట్ చేసే యూట్యూబర్లకు తగిన సమయాన్ని ఇస్తుంది. అయితే ఆ వ్యవధి తర్వాత కూడా ఇదే మళ్లీ పునరావృతమైతే ఫస్ట్ వార్టింగ్​గా ఆ కంటెంట్​ను తొలగిస్తుంది.

అయినా కూడా ఇంకా అలాంటి కంటెంట్​నే పోస్ట్ చేస్తే మాత్రం ఆ ఛానెల్​ సంబంధిత కంటెంట్ క్రియేటర్​పై జరిమానా విధించే అవకాశాలు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఇలా కొత్త విధానాన్ని ఉల్లంఘించే వీడియోలను మొదట్లో క్రియేటర్‌ల ఛానెల్స్​ను హెచ్చరించకుండా తొలగించడంపై ప్రస్తుతం యూట్యూబ్ దృష్టి సారిస్తోంది.

శాంసంగ్ లవర్స్​కు గుడ్​న్యూస్- అధిక ర్యామ్ కెపాసిటీతో 'గెలాక్సీ S25' సిరీస్- రిలీజ్ ఎప్పుడంటే?​

కళ్లు చెదిరే లుక్​లో లగ్జరీ రేంజ్​ రోవర్ స్పోర్ట్​- రూ.5లక్షలు పెరిగిన ధర- ఇప్పుడు ఈ కారు రేటెంతంటే?

అన్​లిమిటెడ్ ఫన్: వాట్సాప్​లో న్యూ ఇయర్ ఫీచర్స్.. ఫెస్టివల్ థీమ్​తో స్టిక్కర్స్, ఎఫెక్ట్స్, యానిమేషన్స్ కూడా..!

ABOUT THE AUTHOR

...view details